Current Time:
Set Alarm:
Hour Minutes Seconds
Set Alarm Action:
*Location of page to launch

 

 https://saisannidhiblog.com  నుంచి గ్రహించబడినది

కాకడ ఆరతి (తెలుగు అర్థము తో)

(మేలుకొలుపు ఆరతి) (ఉదయం గం. 5.15 ని. లకు దీపము అగరువత్తి పెట్టి

వెన్న నివేదించి, 5 వత్తులతో ఆరతి యివ్వాలి)

1. జోడూనియా కర చరణీ – ఠెవిలా మాథా |

పరిసావీ వినంతీ మాఝా – సద్గురునాధా !

అసోనసో భావ ఆలో – తూజీయా ఠాయా |

కృపాదృష్టి పాహే మజకడే – సద్గురురాయా ||

అఖండిత అసావే ఐసే వాటతే పాయీ |

సాండూనీ సంకోచ ఠావ – థోడాసా దేయీ |

తుకా హ్మణే దేవా మాఝా – వేడీవాకుడీ |

నామే భవపాశ హాతి – ఆపుల్యా తోడీ ||

అర్ధము : నా చేతులు రెండు జోడించి నా శిరస్సును నీ పాదములపై వుంచాను.  సద్గురు సాయినాథా నా ప్రార్ధన వినుము. 2. నీ యందు భక్తిభావము నాకుఉన్నదో లేదో నేను మాత్రము నీ వద్దకు చేరాను. నన్ను కృపాదృష్టితో చూడుము. 3. అఖండమైన నీ పాదసేవను ఆశించాను. నీవు  మాత్రము సంకోచించక నీపాదముల వద్ద కొంచెము స్థానము యిమ్ము. 4. తుకారాము వేడినట్లుగా మేముచేయు నామములోని లోపాలను ఎంచక మా ప్రాపంచిక కర్మ బంధములనుదూరము చేయుము.

2. ఉఠా పాండురంగా ఆతా ప్రభాతసమయో పాతలా |

వైష్ణవాంచా మేళా గరుడపారీ దాటలా ||

గరుడపారాపాసూని మహాద్వారా – పర్యంత |

సురవరాంచి మాంది ఉభీ – జోడూనియా హాత ||

శుక, సనకాదిక నారద, తుంబుర – భక్తాంచ్యా కోటీ |

త్రిశూల డమరూ ఘే ఉని ఉభా – గిరిజేచా పతీ ||

కలియుగీచా భక్త నామా – ఉభా కీర్తనీ

పాఠీమాగే ఉభీ డోళా – లావూనియా జనీ ||

అర్ధము :1 . ఓ పాండురంగా! ప్రభాత సమయమగు చున్నది. వైష్ణవులంతా గరుడస్తంభము వద్ద నిలచి ఉన్నారు. 2. గరుడస్తంభము నుండి మహా ద్వారము వరకు దేవతలందరూ చేతులు జోడించి నీ దర్శనము కొరకు వరుసలలో నిలచి యున్నారు. 3. శుక, సనక, నారద, తుంబురుడు మొదలైన భక్తులు మరియు త్రిశూలఢమరులు ధరించిన గిరిజాపతి అయిన శివుడు కూడా నీ దర్శనమునకు నిలచియున్నారు. 4. కలియుగ భక్తుడైన నామ దేవుడు, నీ పాద దాసి జనాబాయి కూడా నీ దర్శనమునకు వేచియున్నారు.

3. ఉఠా ఉఠా శ్రీ సాయినాధ గురు-చరణకమల దావా |

ఆధివ్యాధి భవతాప వారునీ – తారా జడజీవా ||

గేలీ తుమ్హా  సోడునియా – భవతమరజనీ విలయా |

పరి హీ అజ్ఞానాసీ తుమచీ – భులవి యోగమాయా ||

శక్తిన ఆమ్హా యత్కించిత్హీ – తిజలా సారాయ |

తుమహీచ తీతే సారుని దావా – ముఖ జన తారాయా ||

భో సాయినాధ మహారాజ – భవతిమిరనాశక రవీ |

అజ్ఞానీ ఆమహీ కితీ తుమిచ – తవ వర్ణావీ థోరవీ

తీ వర్ణితా భాగలే – బహువదని శేషవిధి కవీ |

సకృప హోని మహిమా తుమచా – తుమహీచ వదవావా  || ఉఠా||

                                                            

భక్తమనీ సద్భావ ధరూని – జే తుమ్హా అనుసరలే ||

ధ్యాయాస్తవ తే దర్శన తుమచే – ద్వారి ఉభే ఠెలే ||

ధ్యానస్థా తుమ్హాస పాహూనీ – మన అముచే ధాలే !

పరి త్వద్వచనామృత ప్రాశాయా తే – ఆతుర ఝాలే ||

ఉఘడూనీ నేత్రకమలా – దీనబంధు రమాకాంతా !

పాహీ బా కృపాదృష్టి – బాలకా జశీ మాతా ||

రంజవీ మధురవాణీ – హరీ తాప సాయినాధా !

ఆమహీచ అపులే కాజాస్తవ తుజ కష్టవితో దేవా

సహన కరిశిల తే ఐకుని ద్యావీ – భేట కృష్ణధావా ||

                                                       || ఉఠా||

అర్ధము : నా గురుదేవుడైన ఓ సాయినాధా లే లెమ్ము. మందబుద్ధులమైన మా యొక్క దారిద్ర్య, రోగ, ప్రాపంచిక బాధలను తొలగించు నీ పాద దర్శనము నిమ్ము. 2. సంసార బంధము నిన్ను అంటుకొనలేదు. కాని ఆ మాయే అజ్ఞానులమైన మమ్ము మోహములో పడవేసినది. 3. ఆ మాయను ఎదురించు శక్తి మాకు కొద్దిగా కూడా లేదు. అట్టి మాయ నుంచి తప్పించుకోగల నీ ముఖ ముఖ దర్శనము కలిగించుము. 4. ప్రాపంచిక వ్యామోహములనే చీకటి తొలగించు సూర్యుని వంటి ఓ సాయినాధ మహరాజా ! మాలోని అజ్ఞానమును తొలగించి జ్ఞానమార్గమును చూపుము. 5. నీ మహిమలు వర్ణించుటకు అనేక ముఖములు కల ఆది శేషునికే వీలుపడలేదు. కృపతో నీ మహిమలను నీవే తెలియపరుచుము. 6. భక్త జనులు భక్తి తో నిన్ను అనుసరించుటకు నీ ధ్యానము చేయుటకు, నిన్ను దర్శించుటకు ద్వారము వద్ద వేచియున్నారు. 7. ధ్యానములో నున్న మిమ్ము చూచి మా మనసులు భ్రమించినవి. అమృతము వంటి నీ మాటలు వినుటకు ఆరాటపడుచున్నాము. 8. ఓ దీనబంధు, ఓ రమాకాంత నీవు కన్నులు తెరచి తల్లి తన కుమారుని చూచునట్లుగా ప్రేమతో నన్ను చూడుము. 9. మధురమైన నీ మాటలతో మా తాపములను హరించి మమ్మానందింప జేయుము. 10. మా పనులు చేయుటకు నిన్ను కష్టపెట్టుచున్నాము. శ్రీ కృష్ణుడవైన నీవు సహనముతో మా మొర విని మాకు దర్శనమిమ్ము..

4. ఉఠా పాండురంగా ఆతా – దర్శన ద్యా సకళా |

ఝాలా అరుణోదయ సరలీ – నిద్రేచి వేళా ||

సంత సాధు ముని అవఘే  – రూలేతీ గోళా |

సోడా శేజే సుఖే-ఆతా ధ్యా బఘు ముఖకమలా ||

రంగమండపీ మహాద్వారీ – ఝాలీసే దాటి

మన ఉతావీళ రూప – వహావయా దృష్టి ||

రాహీ రఖుమాబాయీ తుమ్హా- యేటా ద్యా దయా |

శేజే హాలవునీ జాగే – కరా దేవరాయా ||

గరుడ హనుమంత ఉభే – పహాతీ వాట

స్వర్గీచే సురవర ఘేవుని – ఆలే బోభాట ||

ఝూలే ముక్తద్వార లాభ – ఝాలా రోకడా!

విష్ణుదాస నామా ఉభా – ఘేఉని కాకడా ||

అర్ధము : 1. ఓ పాండురంగా నిద్రాసమయమైపోయి అరుణోదయమవుతున్నది. నీవు నిద్రలేచి, దివ్యకళలతో మాకు దర్శనమిమ్ము. 2. సాధువులు, మునులు మొదలగువారు మీ కొరకు వేచి ఉన్నారు. నిద్ర సుఖమును వదలి నీ దర్శనము కలుగజేయుము. 3. మండపద్వారము వద్ద మా మనసులు నీ దర్శనము కొరకు ఉప్పొంగుచున్నవి. 4. తల్లీ రుక్మిణీ ! నీవైన మా పై దయతో శ్రీ రంగని నిద్రనుంచి మేల్కొల్పుము. 5. గరుడ హనుమంతులు మి దర్శనం కోసం వేచియున్నారు. స్వర్గం నుండి దేవతలు నీ నామజపం చేస్తూ వచ్చారు. 6. విష్ణు దాసులు, నామదేవుడు కాకడ ఆరతితో నిలచియున్నారు. నీ మందిర ద్వారము తెరచి మా కానందము కలిగించుము.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార