Current Time:
Set Alarm:
Hour Minutes Seconds
Set Alarm Action:
*Location of page to launch

 సాయంకాల ఆరతి 

సాయంకాలం గం. 6 .15 ని,ల కు (సూర్యాస్తమయం ని బట్టి మారును ) ధూప దీప నైవేద్యానంతరము 1 వత్తి తో ఆరతి యివ్వాలి.                 

                       1.ఆరతి

ఆరతి సాయిబాబా ! సౌఖ్యదాతార జీవా !

చరణరజాతలి ! ద్యావా దాసా విసావా భక్తా విసావా    ||ఆరతి||

జాళూనియా అనంగ ! స్వస్వరూపీ రాహే దంగ !

మముక్షుజనా దావీ ! నిజ దోళా శ్రీరంగ డోళా       || ఆ||

జయా మనీ జైసా భావ ! తయాతైసా అనుభవ !

దావిసీ దయాఘనా ! ఐసీ తుజీ హీ మావ    || తుజీ||    ||ఆ||

తుమచే నామ ధ్యాతా ! హరే సంసృతివ్యథా !

అగాధ తవ కరణీ ! మార్గ దావీసీ అనాథా      ||దావీసీ ||    ||ఆ||

కలియుగీ అవతార ! సగుణబ్రహ్మ సాచార !

అవతీర్ణ ఝాలాసే ! స్వామి దత్త దిగంబర దత్త!! ||ఆ||

ఆఠ దివసా గురువారీ ! భక్త కరితీ వారీ !

ప్రభుపద పహావయా ! భవభయ నివారీ    || భయ||      ||ఆ||

మాఝా నిజద్రవ్యఠెవ తవ చరణరజ సేవా

మాగనే హేచి ఆతా ! తుమ దేవాధీ దేవా దేవా!!        ||ఆ||

ఇచ్చిత దీన చాతక ! నిర్మలతోయ నిజసూఖ !

పాజావే మాధవా యా ! సంభాళ ఆపులీభాక       ||ఆపూ||   ||ఆ||

అర్ధము :1. ఓ సాయిబాబా మీకు హారతి చేసెదము. నీవు సర్వ జీవులకు సౌఖ్యము నిచ్చువాడవు. 2. మీ దాసులము,మీ భక్తులము అయిన మాకు మీ పాదధూళిలో స్థానమివ్వండి 3. మీరు కాముని దగ్ధం చేశారు. ఎప్పుడూ పూర్తిగా ఆత్మస్థితిలోనే వుంటారు. 4. ముక్తికోరు జనులకు మీరు నిజ దృష్టిని ప్రసాదిస్తారు. 5.మీరు ఎవరి మనోభావాలను బట్టి వారికి అలాంటి అనుభవము యిస్తుంటారు. 6. ఓ దయాఘనా ! వారి వారి మనోభావాలను బట్టి నీవు నీ శక్తిని కూడ చూపిస్తుంటావు. 7. మీ నామ ధ్యానము ప్రాపంచిక బాధలను తొలగిస్తుంది. 8. మీ చేతలు అగాధములు. అనాధలకు సరైన మార్గం చూపువాడవు. 9. కలియుగంలో వెలసిన భగవత్స్వరూపుడవు. సంచరించే సగుణబ్రహ్మ స్వరూపుడవు. 10. దత్త దిగంబర స్వామిగా మీరు అవతరించారు. 11. ప్రతి 8 రోజులకొకసారి వచ్చు గురువారమునాడు భక్తులు మీ దగ్గరకు వస్తారు. 12. పాదములాశ్రయించు భక్తుల భవభయములు తొలగించెదరు. 13.మీ పాదధూళి సేవకు నా యొక్క సర్వధనము ” ఖర్చగునట్లుగా చేయుమని మిమ్ము ప్రార్ధిస్తున్నాను. 14, 15. ఓ దేవాధిదేవా! చాతకపక్షి నిర్మలమైన జలమునే త్రాగును. 16. మా రూపమనే జలమును మాత్రమే త్రాగునట్లుగా నన్ను అనుగ్రహించుము, ఓ మాధవ!

                     

                  2.అభంగము

శిరడి మాఝే పండరపుర – సాయిబాబా రమావర

బాబా రమావర – సాయిబాబా రమావర.

శుద్ద భక్తి చంద్రభాగా – భావ పుండలీక జాగా.

పుండలీక జాగా – భావ పుండలీక జాగా.

యాహో యాహో అవఘే జన కరా బాబాన్సీ వందన

సాయీసీ వందన కరా – బాబాన్సీ వందన

గణూమానే బాబా సాయీ – ధావపావ మాఝే ఆయీ

పావమాఝ ఆయీ – ధావపావ మాఝే ఆయీ

అర్ధము :1. షిరిడి నాకు పండరీ పురము. సాయిబాబాయే రమావరుడైన విఠలుడు. 2. పరిశుద్ధమైన భక్తి భావము చంద్రభాగానది. భక్తి భావమే పుండలీకుని నివాసము ! 3.ఓ జనులారా! రండి, రండి బాబాకు వందనము చేయండి. 4. ఈ దాసుగుణు పిలుస్తున్నాడు. తల్లిలాంటి ఓసాయి. నన్ను కాపాడ పరుగు పరుగున రమ్ము.

               

                           3.నమనము (కర్పూరము వెలిగించి హారతి యిస్తూ)

ఘాలీన లోటాంగణ, వందీన చరణ,

డోల్యాని పాహీన రూప తుఝే,

ప్రేమే ఆలింగిన, ఆనందే పూజిన.

భావే ఓవాళీన మణే నామా ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవ దేవ !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావాత్

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణా యేతి సమర్పయామి ||

అచ్యుతం కేశవం రామనారాయణం

కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికా వల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే ||

అర్ధము: మీ పాదములపై శిరస్సు వుంచి సాష్టాంగ నమస్కారము చేయుచూ మీ రూపాన్ని చూచి ఆనందిస్తూ ప్రేమతో మిమ్ము ఆలింగనం చేసికొని, ఆనందంగా మిమ్మల్ని పూజిస్తూ మీ నామస్మరణచేస్తూ, మీకు హారతి యిస్తాము. 2. నీవే నాకు తల్లివి, తండ్రివి, సర్వబంధువులు నాకు నీవే. నాకు స్నేహితుడవు నీవే, నీవే విద్యవు, నీవే ధనము. దేవదేవుడవైన ఓసాయి! నీవే నాకు సర్వస్వము. 3. శరీరము, వాక్కు మనస్సు యింద్రియాలతోను, బుద్ధి, ఆత్మ, సహజమైన ప్రాకృతిక స్వభావాలన్నిటితోను ఏమేమి పనులు చేస్తానో అవి మొత్తం నారాయణ రూపుడవైన నీకు సమర్పిస్తున్నాను. 4. అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, హరి, శ్రీధర, మాధవ, గోపికా వల్లభ, జానకీ నాయక, రామచంద్ర మొదలైన అనేక పేరులతో పిలువబడు నిన్ను నేను భజిస్తున్నాను.

           4.నామస్మరణము

హరే రామ హరే రామ రామరామ హరే

హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ||

                  శ్రీ గురుదేవ దత్త !

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార